Sunil Gavaskar: ఇండియా-Bని కూడా పాక్ ఓడించలేదు...సునీల్ గవాస్కర్ 1 y ago
పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతమున్న ఫామ్ తో పాక్ జట్టు.. ఇండియా బి టీమ్‌ను కూడా ఓడించడానికి శ్రమించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ ఒకప్పుడు ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లకు అడ్డాగా ఉండేదన్నాడు. ప్రస్తుతం అత్యున్నత స్థాయిలో రాణించగల ఆటగాళ్లను తయారుచేయడంలో పాక్ విఫలమైందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. చిరకాల ప్రత్యర్థిపై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.